calender_icon.png 1 January, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రాజకీయాలకు కొత్త దిశ

30-12-2025 12:00:00 AM

100 రోజుల్లోనే ప్రకంపనలు సృష్టించాం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో పురుడు పోసుకున్న కేవలం 100 రోజుల్లోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ బీసీ రాజకీయాలకు కొత్త దిశను చూపిందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ తెలిపారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా టీఆర్పీ పార్టీ మూల సిద్ధాంతం అని చెపుతూ.. ‘బీసీలకు ఆత్మగౌరవం, రాజకీయ అధికారం, సముచిత వాటా ఈ మూడు నినాదాలను పార్టీ తన ప్రధాన అజెండగా ముందుకు తీసుకెళ్తుంది.

ప్రధాన పార్టీలను బీసీ ఎజెండా వైపు మళ్లించిన ఉద్యమం. కాం గ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ వంటి ప్రధాన రాజకీయ పార్టీలను బీసీ అంశాలపై మాట్లాడేలా చేసిన రాజకీయ ఒత్తిడి టీఆర్పీ ఉద్యమం సృష్టించింది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ఓట్లు సాధించాం’ అని చెప్పారు. 

టీచర్ ఎమ్మెల్సీలో యూనియన్లకు దీటుగా పోటీ

నల్లగొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన యూనియన్లను ఎదుర్కొని ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థులు సమాన స్థాయిలో ఓట్లు సాధించారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాల ప్రభావంతో ఎమ్మెల్యే కోటాలోని ౫ స్థానాల్లో ౪ స్థానాలు బీసీలకు కేటాయింక తప్పని పరిస్థితి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై బీసీ ఉద్యమ ప్రభావాన్ని ఆధారాలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలంగాణ సమాజం ముందు ఉంచారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల ఉద్యమం.బీసీలకు విద్యలో, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని లక్ష్యంతో టీఆర్పీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది.

స్థానిక సంస్థల ఎన్నికల అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపునకు ఉద్యమం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో సర్పంచ్ స్థానాలు, వందల సంఖ్యలో వార్డు సభ్యులు స్థానాలు సాధించింది. బీసీ యువతలో రాజకీయ చైతన్యం తేవడం, మంత్రివర్గ విస్తరణలో అగ్రవర్ణాలకు బ్రేక్ వేసింది. పొత్తులో భాగంగా వచ్చిన ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ అభ్యర్థికే ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చారు. అన్ని రాజకీయ పార్టీలను ‘బీసీ బోను’లోకి ఎక్కించిన ఉద్యమం టీఆర్‌పీది అని అశోక్ చెప్పారు. బీసీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ప్రయత్నాలు 

బీసీ ఉద్యమ తీవ్రతతో ముఖ్యమంత్రి వెనకడుగు వేశారని పేర్కొన్నారు. కార్మిక రంగంలో ఎస్‌ఆర్బి బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రధాన పార్టీల ట్రెడ్ యూనియన్‌లో ఓడించి టీఆర్పీ ట్రెడ్ యూనియన్ ఘన విజయం సాధించింది అని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాల్లో టీఆర్పీ అడుగులు వేసింది. రాష్ట్ర, జిల్లా, మండల కమిటీలు పూర్తి చేసి, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం, త్వరలో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది.