30-12-2025 12:00:00 AM
మున్సిపల్ ఆఫీసులో అనధికారికంగా ఉన్న రూ.41 వేల నగదు సీజ్
హుజురాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్ట ణంలోని మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్‌తో కూడిన 12 మంది సభ్యులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఇతరులను లోనికి అనుమతించకుండా తలుపులు మూసివేసి ఒక్కొక్క రిగా ఉద్యోగులను విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. అ నంతరం మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ వివరాలు తెలిపారు.
మున్సిపాలిటీలో రికార్డులు సరిగా లేవని, ఉద్యోగులకు సంబంధించిన అటెండెన్స్ వివరాలు పూర్తిగా నమోదు చేయకుండా వది లివేసారు.మ్యూటేషన్ వివరాలు సరిగా న మోదు చే యలేదని బిల్డింగ్ సంబంధించిన పర్మిషన్లు అనుమతులు సరిగా లేవన్నారు. అనధికారికంగా టౌన్ ప్లానింగ్‌లో ఉన్న రూ.41,117 సీజ్ చేసినట్టు వెల్లడించారు.
నిత్యం జెసిబి లెవెలింగ్ బ్లేడుకు రూ.5 వేల బిల్లు డ్రా చేస్తున్నారని, దానికి సంబంధించిన వివరాలు చూపలేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సదానందం వద్ద ఫోన్ పేలో కొన్ని డబ్బులు ఉన్నాయని, వాటికి సంబంధించిన సమాధానం సరిగా లేకపోవడంతో ఆ ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. పూర్తి రికార్డులను స్వాధీనం చేసుకొని వారం రోజుల్లో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు.