calender_icon.png 10 August, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రకు కొత్తరూపు

12-08-2024 12:46:13 AM

కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు 

హైదరాబాద్, ఆగస్టు 11(విజయక్రాంతి): భోగాపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్ర య పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌పోర్టు పనుల్లో పురోగతిని ప్రతి నెల ప్రజ లకు తెలియచేస్తామని చెప్పారు. గత నెల నుంచి ఇప్పటీ వరకు 4 శాతం పురోగతి ఉందని తెలిపారు. ఇప్పటివరకు 36 శాతం పనులు పూర్తయ్యాయని, గడువు కంటే ముందే పూర్తి చేస్తామని స్పష్టంచేశారు.  శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ వద్ద విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు తెలిపారు.