calender_icon.png 9 August, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులపై బాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరి

12-08-2024 12:44:12 AM

మాజీ సీఎం వైఎస్ జగన్ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియాన్ని ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దీంతో రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంట బీమా ప్రీమియం ఏటా ఏప్రిల్, మే నెలలో చెల్లించామని గుర్తుచేశారు. బాబు సర్కార్ వెంటనే స్పందించి ప్రీమియం చెల్లించాల్సి ఉన్నప్పటికి, దాని గురించి పట్టించుకోవట్లేదని విమర్శించారు.