18-12-2025 12:00:00 AM
ముకరంపుర, డిసెంబరు 17 (విజయ క్రాంతి) : నగరంలోని పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.చాణక్యన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక అయ్యాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ తెలిపారు. ఈ నెల 15 న కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎస్.జి.ఎఫ్ అండర్ 14 బాలుర బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలలో చాణక్యన్ 32 -34 కిలోల విభాగంలో బంగారు పధకం సాధించి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు.
హన్మకొండ పట్టణంలోని జె.ఎన్ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ లో ఈ నెల 18 నుండి 25 వరకు నిర్వ హించనున్న 69వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్ , హనుమంతరావు. ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత ప్రసాద్ సమన్వయకర్త శ్రీనాథ్ విద్యార్థిని, బాక్సింగ్ కోచ్ ఎ రామకృష్ణ ను అభినందించారు.