calender_icon.png 18 December, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది ‘పంచాయతీ’ ప్రశాంతం

18-12-2025 12:00:00 AM

  1. ముగిసిన పంచాయతీ ఎన్నికలు మూడో విడతలో పోటెత్తిన ఓటర్లు 
  2. సంగారెడ్డి జిల్లాలో 87.43 శాతం 
  3. మెదక్ జిల్లాలో 90.68 శాతం నమోదు
  4. సిద్దిపేట జిల్లాలోని 9 మండలాల్లో 88.45 శాతం పోలింగ్ 
  5. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు

సంగారెడ్డి, డిసెంబర్ 17 (విజయక్రాంతి): మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 518 సర్పంచ్ స్థానాలకు, 3,939 వార్డులకు మూడో విడత ఎన్నికలు జరిగాయి. కాగా సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి, కల్హేర్, మనూర్, నాగల్గిద్ద, నారా యణఖేడ్, నిజాంపేట, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లోని 207 పంచాయతీలకు, 1,537 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.

ఈ పంచాయతీలలో 1,13,019 మంది పురుష ఓటర్లు, 1,12,456 మంది మహిళా ఓటర్లు, మొత్తం 2,25,483 ఓటర్లు ఉన్నారు.  ఉదయం 9 గంటల వరకు 26.75 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉదయం 11 గంటలకు 59.39 శాతం, పోలింగ్ ముగిసే సమయానికి మొత్తంగా 1,97,134 మంది ఓటింగ్లో పాల్గొనగా 87.43 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

మెదక్ జిల్లాలో 90.68 శాతం నమోదు...

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడవ విడత ఎన్నికల్లో మెదక్ జిల్లాలో 90.68 శాతం నమోదు అయింది. జిల్లాలో మూడవ విడతకు చిలిపిచేడ్, కౌడిపల్లి, కొ ల్చారం, మాసాయిపేట్, నర్సాపూర్, శివంపేట్ ,వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరిగా యి. ఈ మండలాల్లో మొత్తం 1,62,348 ఓటర్లు ఉండగా, 1,47,210 పోలయ్యాయి.

ఉదయం 9 గంటలకు 24.22 శాతం, ఉద యం 11 గంటలకు 63.81 శాతం, మధ్యా హ్నం ఒంటి గంట తర్వాత పోలింగ్ ముగిసే సమయానికి 90.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇలావుండగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మూడు విడతలలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, రాహుల్ రాజ్ తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో ప్రశాంతం..జిల్లాలోని 9 మండలాల్లో 88.45 శాతం పోలింగ్

సిద్దిపేట, డిసెంబర్ 17 (విజయక్రాంతి) :  సిద్దిపేట జిల్లాలో బుధవారం జరిగిన మూడవ విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఓటర్లు భారీగా తరలివచ్చీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మద్దూరు మండలంలోని లద్నూర్ 100 సం. అబ్ధుల్ షమీ, చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో 95 సం. వృద్ధురాలు ఓటు వేసింది.

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రమేష్ చివరి నిమిషంలో కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నా రు.  3వ దశ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా 88.45 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలంలో ఎన్నికలు సజావుగా ముగిశాయి. జిల్లా కలెక్టర్ హైమావతి పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ లు ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.