22 June, 2026 | 2:58 AM

ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం

22-06-2026 12:00 AM

సమస్యలకు చెక్ పెట్టడమే మా లక్ష్యం ః-హైదరాబాద్ సీపీ సజ్జనార్

జూబ్లీహిల్స్, జూన్ 21 (విజయక్రాంతి): ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూ పడమే లక్ష్యమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రయల్ రన్ ఆదివారం నిర్వహించారు.

ట్రాఫిక్ జాయింట్ సీసీ జోయల్ డేవిస్, డీసీపీ కాజల్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణా రెడ్డి తదితరులతో కలిసి సీపీ సజ్జనార్ ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. కేబీఆర్ పార్కు మెయిన్ గేట్, బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నంబరు 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు గల ప్రధాన కూడళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మా ట్లాడుతూ కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్, 7 అండర్ పాస్ పనులు జరుగుతున్నాయన్నారు.

వాటి దృష్ట్యా ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. ఏప్రిల్ 5 మొదటి ట్రయల్ రన్ నిర్వహించామని, ప్రస్తుతం రెండో ట్రయల్ నిర్వహించినట్లు వెల్లడించా రు. గతంలో గమనించిన లోపాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలను తీసు కున్నామన్నారు. నేటి నుంచి వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతాయన్నా రు. భవిష్యత్తులో వాహనాల రద్దీ పెరగనుందని పేర్కొన్నారు. కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఇటువంటి పరిశీలనాత్మక కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు.

వన్ వే విధానం వల్ల ప్రయాణ దూరం స్వల్పంగా పెరిగినప్పటికీ ఎక్కడా జామ్ లు లేకుండా ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని వివరించారు. వాహనదారులు రోడ్లపై అకస్మాత్తుగా లేన్లు మార్చడం వల్ల కొంత గందరగోళం ఏర్పడుతోందన్నారు. అందువల్ల పోలీసులు జారీ చేసే అడ్వైజరీలు, సూచిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రోడ్లపై పెండింగ్లో ఉన్న సివిల్ పనులను త్వరగా ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్గంలో ఉన్న ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. అంబులెన్సుల రాకపోకల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని సీపీ హామీ ఇచ్చారు.

తగిన జాగ్రత్తలు తీసుకుంటాం : జోయల్ డేవిస్, ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ

వన్ వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. వాహనాలు లైన్లు మారేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎదురైన ఇబ్బందులను గుర్తించామన్నారు. వాహనాలు సులభంగా లైన్లు మారడానికి చెక్పోస్టు - కేబీఆర్ పార్కు మధ్య 150 మీటర్ల ఇంటర్ చేంజ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాదచారులు సురక్షి తంగా రోడ్డు దాటేందుకు చెక్పోస్టు, కేబీఆర్ పార్కు వద్ద పెడెస్ట్రియన్ సిగ్నళ్ల ఏర్పాటుపై నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా ఈ జంక్షన్లలో ట్రాఫిక్ విధానాన్ని నిరంతరం పర్య వేక్షిస్తున్నామని వివరించారు. నగర ప్రగతికి, సాఫీ ప్రయాణానికి ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని డేవిస్ కోరారు.