22 June, 2026 | 3:03 AM

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొ.జయశంకర్ పాత్ర కీలకం

22-06-2026 12:00 AM

బండి రమేష్

కూకట్‌పల్లి, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రొ. జయశంకర్ పాత్ర కీలకమని టిపిసిసి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. ఆదివారం జయశంకర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని మూసాపేట ఆంజనేయ నగర్ చౌరస్తాలో జయశంకర్ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్ర అత్యంత కీలకమన్నారు.

తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఆయన చూపిన చొరవ వేసిన మార్గము కారణంగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కష్టపడుతూ నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుష్పారెడ్డి, సాయిబాబా చౌదరి, మదన్మోహన్, అస్లాం, సుజాత, వాణి, శ్రీనివాసబాబు, రవి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.