calender_icon.png 14 January, 2026 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

14-01-2026 12:25:21 AM

చేగుంట, జనవరి 13 :గుర్తు తెలియని వాహనము ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట శివారులో జరిగింది. చేగుంట గ్రామ శివారులో గల స్మశాన వాటిక సమీపంలో రెడ్డిపల్లి బ్రిడ్జి పైన నిజామాబాద్ వైపు నుండి హైదరాబాదు వైపు రోడ్డుపైన ఒక గుర్తు తెలియని వ్యక్తి డివైడర్ ను దాటుతుండగా గుర్తు తెలియని వాహనము ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.