calender_icon.png 30 September, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెకు మారిన రాజకీయ యుద్ధం

28-09-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ర్ట రాజకీయాలు ప్ర స్తుతం ఉద్రిక్త ఉత్కంఠ నింపుకున్నాయి. పండుగల హడావుడి, పల్లెల్లో నిశ్శబ్దంగా ఓ పెను రాజకీయ యుద్ధం రాజుకుంటోంది. మునుపెన్నడూ లేని విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ యంత్రాంగం వేగం పెంచిం ది. రిజర్వేషన్ల పజిల్ ఎప్పుడు లీక్ అవుతుందా అని ఆశావహులు ఆసక్తిగా ఎదు రుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పల్లెల్లో మొదలైన ఈ పవర్ ప్లాన్ రాష్ర్టంలోని 33 జిల్లాలకు విస్తరిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్.. మూడు పార్టీలలోనూ టికెట్ల కేటాయింపు కోసం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు అత్యున్నత స్థాయికి చేరాయి.

రిజర్వేషన్లు, గ్రూప్ రాజకీయా లు, భారీ నిధుల వినియోగం.. త్రిముఖ దాడిలోనే స్థానిక ఎన్నికల ఫలితాలు దాగి ఉన్నాయనేది నిర్వివాదాంశం. స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అసాధారణ వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యాయి. అయితే బీసీ రిజర్వేషన్ల జో వో అమలు ఇప్పుడు నేతలను ఉక్కిరిబిక్కి రి చేస్తోంది. ఉన్నతాధికారుల ఆమోదం కో సం ఫైళ్లు కదులుతున్నాయి. హడావుడిగా రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలన్నీ చూస్తుం టే ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల కావచ్చనే సంకేతాలు బలపడుతున్నాయి.

కీలకంగా రిజర్వేషన్లు

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లలో వచ్చే మార్పులు అనేక మంది మాజీ ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయనున్నాయి. ఈ రిజర్వేషన్ల పజిల్ ముందే తెలుసుకోవడానికి పార్టీలు రహస్య ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభు త్వ అధికారులపై ఒత్తిడి తేవడం, అనధికార సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఇవే ప్రస్తుతం రాజకీయాల్లో రిస్క్ ఫ్యాక్టర్‌ను అమాంతం పెంచుతున్నా యి. రిజర్వేషన్లకు సంబంధించి జీవో వచ్చి న వెంటనే పార్టీలు తమ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి పవర్ ప్లాన్‌ను అమలు చేయవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉంది. అధికార కాంగ్రెస్‌కు ఇదొక సవాల్ లాంటిది.

ఇరు పార్టీల్లోనూ అంతర్గత రాజకీయాలు తీవ్రమై, స్థానిక ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి. జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యేలు ఒక వైపు, గతంలో పార్టీకి పనిచేసిన సీనియర్ నేత లు, మాజీ నాయకులు మరోవైపు వర్గాలుగా విడిపోయారు. తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని నేతలు పోటీ పడుతున్నారు. ఈ గ్రూప్ తగాదాల వల్ల పార్టీ ఓటు చీలిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ర్టంలో అధికారంలో ఉన్న ఉత్సాహంతో, కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ల్లో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. ఇక్కడ కూడా పీసీసీ, డీసీసీ వర్గానికి మధ్య టిక్కెట్ల కేటాయింపు విషయంలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. అధికార పార్టీలోనే వర్గ పోరు ఉంటే విజయం కష్టమన్న అభిప్రాయం పల్లె ప్రజల్లో కలుగుతుంది.

‘స్థానికం’ సెమీఫైనల్స్

స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే శాసనసభ ఉప-ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా పార్టీలు భావిస్తున్నా యి. అందుకే గ్రూప్ రాజకీయాల నియంత్రణ కోసం అధిష్ఠానం బలమైన సమన్వ య కమిటీలను రంగంలోకి దింపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షానికి మారిన బీఆర్‌ఎస్.. స్థానిక సంస్థల ఎన్నికలను ‘కమ్‌బ్యాక్’ వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. పాత ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి, బీఆర్‌ఎస్ అధిష్ఠానం స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల కొత్త ముఖాలను రంగంలోకి దించే యోచనలో ఉంది.

పల్లెల్లో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు, క్యాడర్ బలం బీఆర్‌ఎస్‌కు ఉండటం వారికి కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొద్ది నెలలే అయినా, బీఆర్‌ఎస్ నాయకులు స్థానిక స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో జాప్యం వంటి అంశాలను ప్రముఖంగా ప్రచారం చేయాలని వ్యూహ రచన చేశారు. నిధులు, అభివృద్ధి అంశాలను లేవనెత్తి ప్రజల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు. పార్టీలకు అతీతంగా గెలిచే అవకాశం ఉన్న పాత నాయకులను తిరిగి పార్టీలోకి ఆకర్షించడం, టికెట్ ఇవ్వడం ద్వారా విజయావకాశాలు పెంచుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. 

నిధుల వినియోగం

స్థానిక ఎన్నికల్లో నిధుల వినియోగం, అసాధారణ స్థాయిలో పెరిగిపోయింది. ఈ నిధులే రాజకీయంగా రిస్క్ పెరగడానికి కారణంగా మారుతున్నాయి. అభ్యర్థు లు పెడుతున్న భారీ కటౌట్‌లు, ఫ్లెక్సీల తయారీకి, గ్రామాల్లో నవరాత్రి/బతుకమ్మ ఉత్సవాలకు ఇచ్చే భారీ విరాళాలు ఇవన్నీ ఆశావహుల ఆర్థిక బలం ప్రదర్శిస్తాయి. గుట్టుచప్పుడుగా సాగే ఈ వ్యాపారానికి లక్షల్లో నిధులు వినియోగిస్తున్నారు. అసెం బ్లీ ఎన్నికల్లో ఓటుకు గుణాంకాలు పెరిగినట్లే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు కొనుగోలు రేట్లు విపరీతంగా పెరగవచ్చనే భయం ఉంది. తమకు టికెట్ దక్క కపోయినా, వేరే పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు గ్రూప్ నేతలకు నిధులు చేరవేయడం లాంటి అనైతిక ప్రయత్నాలు జరిగే అవకాశం కూడా ఉంది.

ఇక తెలంగాణలో యువత ఓటు (18 ఏళ్లు) 35 శాతానికి పైగా ఉంది. దీంతో యువతను ఆకర్షించేందుకు క్రీడా పోటీలు, ఇతర సా మాజిక కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమవుతూ వాటికోసం అడ్డగోలుగా నిధులు మళ్లిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పనితీరుకు తొలి పరీక్ష లాంటిది. అదే సమయంలో బీజేపీ తమ బలాన్ని పెంచుకోవడానికి, బీఆర్‌ఎస్ తమ పునాదిని నిలుపుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నాయి. రిజర్వేషన్ల పజిల్, గ్రూప్ రాజకీయాల కుమ్ములాటలు, నిధుల ప్రవాహం, పల్లె ప్రజల ఆకాంక్షలు.. ఈ అంశాలన్నీ కలిసి స్థానిక ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయి. దీంతో పండుగ జోష్ పూర్తిగా పక్కకెళ్లి తెలంగాణ పల్లెలు ప్రస్తుతం ‘పవర్ పాలిటిక్స్’కు దారి తీసింది. ఈ రాజకీయ ఉద్రిక్తతకు ప్రజా తీర్పే విరామం పలకనున్నది.

 వ్యాసకర్త సెల్: 9640466464