calender_icon.png 30 September, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకాల్లో టీజీపీఎస్సీ విఫలం

28-09-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ మెయిన్స్ పరీక్షపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రావటం, ఆ అభ్యంతరాలపై కొందరు హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జ్ సెప్టెంబర్ 9న తీర్పునిస్తూ గ్రూప్  మెయిన్స్ జవా బు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని లేని పక్షంలో తిరిగి 8 నెలల లోపు మెయి న్స్ పరీక్షను  నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుని ఛాలెం జ్ చేస్తూ టీజీపీఎస్సీ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది.

ఈకేసును విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విస భ్య ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పుని స స్పెండ్ చేస్తూ పిటిషన్ దారుల చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, కాబ ట్టి గ్రూప్ -1 నియామకాలు చేపట్టవచ్చని వెల్లడించింది. ఆ నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉండాలన్న హైకోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసిం ది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం తెలంగాణ అటార్నీ జనరల్ (ఏజీ)ని ఉద్దేశించి నియామకాల విషయంలో అసలు టీజీపీఎస్సీ ఉనికిలో ఉందా? అని చేసిన వ్యాఖ్యలైనా, సింగిల్ జడ్జి తీర్పులో టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని చేసిన వ్యాఖ్యలు తీసుకున్నా రాష్ట్రంలో ప్రధాన రిక్రూట్మెం ట్ ఏజెన్సీ పనితీరుకి అద్దం పడుతుందనే చెప్పాలి. కొంతకాలంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో టెస్టింగ్ ఏజెన్సీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరీక్షల నిర్వహణలో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వైఫల్యం చెందుతుండడంతో విద్యార్థులు వీటిపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. 

నిర్వహణ లోపం

రాష్ర్టస్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లే ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వాటిదే కీలక బాధ్యత. కానీ చాలా రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వైఫల్యం చెందుతున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లోనూ నాటి ఏపీపీఎస్సీపై కూడా అనేక ఆరోపణలు రావటం చూశాం. కానీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత పోటీ పరీక్షలను నిర్వహించే టీజీపీఎస్సీ లాంటి ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై అనేక ఆరోపణలు రావడం గమనార్హం.  టీజీపీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షలు కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయినా కూడా పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ధోరణిలో ఏమాత్రం మార్పు రాకపోవడం విడ్డూరం.

నియామకాల్లో జాప్యం, నోటిఫికేషన్ల విడుదల్లో నిర్లక్ష్య వైఖరి, పరీక్ష నిర్వహణలో వైఫల్యం, పరీక్ష పత్రాల్లో తప్పులు, కోర్టు కేసులు, అవినీతి ఆరోపణలు లాంటి అంశాలు టీజీపీఎస్సీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. దీంతో కమిషన్‌పైై నిరుద్యోగుఉల నమ్మకాన్ని కోల్పోతున్నారు. 2022లో నోటిఫికేషన్ విడుదల చేసిన ఒక్క గ్రూప్ కే మూడు పర్యాయాలు ప్రిలిమినరీ పరీక్ష జరగడం గమనార్హం. ఇక మెయిన్స్‌కు విద్యార్థుల ఎంపికపై కూడా వివాదాలు అలుముకోవటం, మెయిన్స్ జవాబు పత్రాల మూ ల్యాంకనంలో అవకతవకాలు జరిగాయన్న ఆరోపణలతో కోర్టు కేసులు చుట్టుముట్టడానిన చూస్తే టీజీపీఎస్సీని ఎలా చూడాల న్నది ప్రశ్నగా మారిపోయింది.

నియామకాలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉన్నప్పటికీ  వివాదాలు లేకుండా, ఆరోపణలు రాకుండా టీజీపీఎస్సీ ఒక్క పరీక్షనైనా నిర్వహించగలుగుతుందా అనేది ఆలోచించాల్సిన విష యం. గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిష న్ వ్యవహార శైలిని ఏమని వర్ణించాలో అర్థం కాని స్థితి. గ్రూప్ మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో వివాదాలు, పరీక్ష నిర్వహణలో లోపాలు, మూల్యాంకనంలో తప్పులు, అర్హత లేని వారి చేత మూల్యాంకనం చేయించడం, కోర్టు కేసుల నడుమ ఎట్టకేలకు గ్రూప్  నియామకం పూర్తునప్పటికీ, నిరుద్యోగ యువత, విద్యార్థుల్లో టీజీపీఎస్సీ తన నమ్మకాన్ని కోల్పోయిందనే చెప్పాలి. 

జాబ్ క్యాలెండర్ ఎక్కడ?

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత ఒక దశాబ్దం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ విడుదల జాప్యంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ గెలుపులో నిరుద్యోగుల పాత్ర కీలకమైనది. శాసనసభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ సిటీ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని మొదటి సంవత్సరంలోనే రెం డు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్‌ఎస్ దశాబ్ద పాలన కాలం లో 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పుకున్నా..  దీనిని నిర్వహించిన ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీ టీజీపీ ఎస్సీ 35 వేలకు మించి నియామకాలను భర్తీ చేయలేకపోయింది. కాబట్టి గత పాలకుల నిర్లక్ష్యం మరిచిపోయేలా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వేగం పెరిగి ఉద్య మ ఆకాంక్షలు నెరవేరుతాయని నిరుద్యోగులు ఆశించారు. కానీ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను కూడా కొత్త ప్రభు త్వం భర్తీ చేయలేకపోయింది. ఇప్పటివరకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే రేవంత్ సర్కార్ 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందనే విమర్శలను ఎదు ర్కొంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం పాలనపై నిరుద్యోగులు సంతృప్తినే వ్యక్తం చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల్లో మెల్లిగా అసంతృప్తి ప్రారంభమయ్యింది. 

 పారదర్శకత అవసరం

ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామనే హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ 2025 జనవరిలో 15 రకాలైన ఉద్యోగాలతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో 12 కొత్త నోటిఫికేషన్‌లు ఉంటే ఇప్పటివరకు ఒక్కటి విడుదల కాకపోవడంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నా రనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు కల్పించామనే గందరగోళ ప్రకటనలు విడుదల చేయడం కూడా నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.

నోటి ఫికేషన్ రాక జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు భర్తీ కాక నిరుద్యోగులు హైదరాబాద్ వదిలి సొంత గ్రామాలకు వెళ్ళిపో వటంతో అశోక్‌నగర్, చిక్కడపల్లి, సిటీ లైబ్రరీలు బోసిపోయి కనిపిస్తున్నాయి. మరొకవైపు నిరుద్యోగ భృతి హామీతో పాటు యువతకు ‘రాజీవ్ యువ వికాస పథకం’ ద్వారా ఆర్థిక సహాయం అందకపోవటంతో గత ప్రభుత్వం లాగే  కాంగ్రెస్ కూడా మనల్ని మోసం చేస్తుందా అనే భావన నిరుద్యోగుల్లో పెరిగిపోతుంది. అయితే నిరుద్యోగుల కాంక్షను అర్థం చేసుకున్నట్టు కనిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే పోలీస్ రిక్రూట్‌మెం ట్‌తో పాటు టీచర్ల నియామకం చేపట్టేందుకు తుది మెరుగులు దిద్దుతుంది. ఒకవేళ నోటిఫికేషన్లు విడుదలైనా మళ్లీ అదే టీజీపీఎస్సీ చేతికే పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఈసారైనా సజావుగా పరీక్షలు నిర్వహిస్తారా అన్న అనుమానం కలుగుతుంది.

ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఉద్యోగాల నియామ కాల్లో విశ్వసనీయత పెంచుకోవాలి. తెలంగాణ లాంటి ఉద్యమ ప్రభావిత రాష్ట్రాల్లో యువతను పక్కనబెట్టడం వారి అధికారానికి ప్రమాదకరమని గుర్తించాలి. హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని తేలికగా తీసుకున్న అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం ఆ తర్వాత జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించి ఘోర పరాజయం పాలైంది. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆ ప్రమాదం రాకుండా పాలకులే చూసుకోవాలి.

 వ్యాసకర్త సెల్: 9885465877