calender_icon.png 5 January, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడ మున్సిపాలిటీలో సన్నాక సమావేశం

03-01-2026 12:00:00 AM

  1. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం

జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి

మరిపెడ జనవరి 2 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల్లో మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పార్టీ మరిపెడ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం  డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జాటోత్  రామచంద్రనాయక్  ఆదేశాల మేరకు మరిపెడ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పట్టణ జిల్లా పార్టీ నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ పెండ్లి రఘువీరా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సుపరిపాలనతో కాంగ్రెస్ వేవ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో 15 వార్డులు గెలవడం  ముందున్న పెద్ద లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేదించాలంటే పార్టీ శ్రేణులు బేధాభిప్రాయాలు పక్కకు పెట్టి కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి  మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసి ఎమ్మెల్యేకు మరిపెడ మున్సిపాలిటీ విజయాన్ని బహుమతిగా అందివ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాలం రవీందర్ రెడ్డి, గంధసిరి అంబరీష, ఎండి అజీజ్ పాష, కుడితి వెంకట్  రెడ్డి,పానుగోతు రాంలాల్,గుండగాని వెంకన్న , వీసారపు శ్రీపాల్ రెడ్డి, కుడితి నరసింహారెడ్డి, సంతోష్ రెడ్డి, గుండ గాని వేణు, కారంపూడి ఉపేందర్, బోడ రవి,దేవరశెట్టి లక్ష్మీనారాయణ, భాష్పాంగు రవికాంత్, జాటోత్ సురేష్,అక్బర్, బంక ప్రమోద్, చీనా నాయక్ పాల్గొన్నారు.