03-01-2026 12:00:00 AM
ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన పోలంపల్లి గ్రామస్తులు
చేగుంట, జనవరి 2 : చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో సర్పంచ్ భర్త దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్తులు ఎంపీడీవోకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భర్త కొండి స్వామి గ్రామంలో ఉన్న ఇరువైపుల చెట్లను 20,000 రూపాయలకు దళారులకు అమ్మి, వచ్చిన డబ్బును తన సొంతనికి వాడుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో గ్రామ స్తులు నిలదీయగా భరించలేక పం చాయతీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశాడని తెలిపారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎంపీడీవో చిన్నారెడ్డికి, ఎంపీఓ ప్రశాంత్ కు ఫిర్యాదు చేయగా అతన్ని పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.