calender_icon.png 13 December, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే ప్రాజెక్ట్ కోసం ఇక ప్రజా ఉద్యమం

13-12-2025 09:39:05 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో మహబూబాబాద్ లోనే ఏర్ఫాటు చేయడానికి సాదన కమిటీ ఆద్వర్యంలో గంగపుత్ర భవనంలో విస్తృత సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ సాదన కమిటీ ఆద్వర్యంలో గత వారం రోజుల నుండి రైల్వే అధికారులను, ప్రభుత్వ పెద్దలను, ప్రజాప్రతినిధులను కలిసి ఈ ప్రాంతంలోనే ప్రాజెక్ట్ ఏర్పాటు ఆవశ్యకత గురించి తెలుపుతూ విజ్ణప్తులు అందజేశామని, ఒక ప్రక్రియ జరిగిందన్నారు. ఇక చేయాల్సింది ప్రజా ఉద్యమమే నని పేర్కొన్నారు. ప్రజలకు, విద్యార్థులకు ఈ ప్రాజెక్ట్ వల్ల లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని కొమరం భీం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మంగళవారం మెగా ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. అధేవిదంగా జిల్లాలోని ప్రధాన మండలాలకు వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు,అన్ని పార్టీల నాయకులు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కృషి చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని తెలిపారు. ప్రాజెక్ట్ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై రాజకీయాలకతీతంగా సంగటితమై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సాదన కమిటి కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ, కో ఆర్డినేటర్ మైస శ్రీనివాస్, కో కన్వినర్ లు  మార్నేని వెంకన్న, ఎండీ ఖలీల్, సమ్మెట రాజమౌళి, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, పిల్లి సుధాకర్, మండల వెంకన్న, మహ్మద్ ఫరీద్, కొత్తపల్లి రవి, కొండ్ర ఎల్లయ్య, బోడ లక్ష్మణ్, మైస నాగయ్య, కంచ వెంకన్న, మామిడాళ సత్యనారాయణ, సంపంగి రామచంద్రు, పులి శ్రీనివాస్, ప్రేమ్ చంద్ వ్యాస్, రావుల సమ్మయ్య, వడ్డెబోయిన శ్రీనివాస్, పట్టాభి లక్ష్మణ్, దుగ్గి గోపాల్, విష్ణువర్ధన్, మహ్మద్ జానీ, యాకయ్య, హెచ్. లింగయ్య, గౌస్ పాషా, జంపాల యాకయ్య, దేవి ఉపేందర్, మచ్చ వెంకన్న, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.