calender_icon.png 12 November, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లు బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం

12-11-2025 07:56:28 PM

మాస్టర్ ఆఫ్ లా లో కలకోల అనిల్ కు గోల్డ్ మెడల్..

హనుమకొండ (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ లా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ న్యూఢిల్లీలో గల ఈ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదువును పూర్తి చేసినందుకు న్యూఢిల్లీలో వరంగల్ జిల్లాకు చెందిన కలకోల అనిల్ కు బంగారు పథకంతో పాటు సత్కారం లభించింది. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులైన కలకోల అశోక్ బాబు, తల్లి కలకోల రేణుక వారి ఆనందానికి హద్దులు లేకుండా సంబురపడ్డారు. ఈ సందర్భంగా తమ బిడ్డ అత్యున్నత స్థానానికి చేరుకొని గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా గ్రామస్తులంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి కష్టపడి న్యాయవాది వృత్తిలో పేదవారికి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్న తమ కుమారుని నిర్విరామ కృషికి దక్కిన గౌరవం అంటూ తల్లిదండ్రులు ఉద్వేగ భరితంగా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ అందుకున్న అనిల్ మాట్లాడుతూ ఏడవ తేదీ నవంబర్ 2025న న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ అందుకున్నట్టు ఆయన తెలిపారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదంటూ ప్రతిభకు ఉన్న గౌరవాన్ని ఆయన మాటల్లో చెప్పలేనిది అంటూ సంతోషంతో పొంగిపోయారు. ఇది జీవితంలో మరిచిపోలేని సంఘటన అంటూ  సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.