12-11-2025 07:56:35 PM
ప్రలోభాలు ఎన్ని ఎదురైనా ఫలితం మాదే..
కాంగ్రెస్ కు ఝలక్ ఖాయం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
మణుగూరు,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు ఝలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తద్యమని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని మౌనిక రెస్టారెంట్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలకు గూరి చేసిన జూబ్లీ హిల్స్ ఓటర్లు సునీతమ్మ వైపే ఉన్నారని ఆమె గెలుపు ఇక లాంచనమేనని స్పష్టం చేశారు.
పదేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన బీఆర్‌ఎస్ పాలనకు, గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో పెరిగిన గందర గోళానికి మధ్య ప్రజలు తుది తీర్పు చెప్ప బోతున్నారన్నారు. అన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ప్రకటించాయన్నారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఎన్నికలలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని
దుయ్యబట్టారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చేసింది ఏమి లేదని, కాంగ్రెస్ నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపరని, ఎన్నికల ఫలితాలలో ఈనెల 14 న బీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ గెలుపు ద్వారా కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ పతనానికి నాంది పలుకుతారన్నారు. వచ్చే సారత్రిక ఎన్నికలలో తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరుతుందన్నారు.