12-11-2025 07:52:16 PM
వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు..
వనస్థలిపురంలోని ఓల్డేజీ హోం సందర్శన..
ఎల్బీనగర్: వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని బుధవారం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ... ప్రపంచంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని, ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్నారు. ఇందుకోసం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పోరాడుతుందని, ఎంతోమంది పేదలకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అందులో భాగంగా వనస్థలిపురంలో పెద్ది శంకర్ నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమంలో వృద్ధులకి మధ్యాహ్న భోజనం, చలికాలం సందర్భంగా బ్లాంకెట్లు పంపిణీ చేశామని, భవిష్యత్తులో ఉచిత ఆశ్రమాలు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని నేషనల్ డైరెక్టర్ నితిన్ చక్రవర్తి తెలిపారు.