calender_icon.png 7 July, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ వైద్యురాలికి అరుదైన ఘనత

07-07-2025 12:40:44 AM

చంద్రికకు సౌత్ ఇండియా ఉమెన్ అవార్డు 

నిర్మల్, జూలై 6 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీదేవ్ బాయ్ హాస్పిటల్‌కు చెందిన స్త్రీవైద్య నిపుణురాలు కాసర్ వార్ చంద్రికకు అరుదైన గౌరవం దక్కింది. వైద్య సేవా రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు సౌత్ ఇండియా ఉమెన్ అవార్డు ఎంపికయ్యారు.

ఆదివారం చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును నిర్వాహకులు చంద్రికకు ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న చంద్రికకు దేవ్ బాయ్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ అవినాష్, సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. సేవా రంగంలో అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ అవార్డును తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్టు చంద్రిక తెలిపారు.