calender_icon.png 7 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సేవలో ఐవీఎఫ్ ముందంజ

07-07-2025 12:38:33 AM

  1. దేశంలోనే అధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత ఐవీఎఫ్ తెలంగాణకే దక్కింది

ఘనంగా ఐవీఎఫ్ 12వ వార్షికోత్సవ వేడుకలు

ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి):  సామాజిక సేవలో ఐవీఎఫ్ ముందంజలో ఉన్నదని ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్  గుప్తా అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా ముషీరాబాద్ లోని వైశ్య హాస్టల్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని వైశ్యులందరినీ ఏకం చేయాలని మంచి సంకల్పంతో ఐవి ఎఫ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దేశంలోనే ఐవిఎఫ్ తెలంగాణ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం డాక్టర్ బాలు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్ తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఉన్నత శిఖరాలను అధిరో హించిన విశ్వనాథన్ కార్తికేయతో పాటు కుటుంబ సభ్యులను సన్మానించారు.

రూ. 10 వేలను ఇంజనీరింగ్ చదువుతున్న అనూ ష విద్యాభ్యాసం కోసం ఉప్పల శ్రీనివాస్ గుప్త  అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలను  నిర్వహించిన డాక్టర్ బాలు, కట్ట రవికుమార్, కొడిపాక నారాయణ, సంబు పాండయ్య, చింతల రజనీకాంత్, ఎర్రం చంద్రశేఖర్, కాపర్తి నాగరాజు, పబ్బ మల్లేశం, బెల్దే రవికుమార్, ఉప్పల నర్సింలు లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఐవిఎఫ్ ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, కోశాధికారి కొడిపాక నారాయణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవికుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు కాచం కృష్ణమూర్తి గుప్త, సేవాదళ్ చైర్మన్ డాక్టర్ బాలు, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నీల శ్రీధర్, సలహాదారులు ముత్యాల సత్తయ్య, ఎల్ వి కుమార్, బోనగిరి శ్రీనివాస్, కోటగిరి శ్రీధర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల స్వప్న, ప్రధాన కార్యదర్శి లంకెపల్లి మంజుల, మణిమాల స్వాతి, వివిధ జిల్లాల ఐవీఎఫ్ ప్రతినిధులు యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.