7 March, 2026 | 6:54 AM

మహిళకు అరుదైన శస్త్రచికిత్స

06-03-2026 02:22 AM

దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్లో 

ఛాతీ నుంచి భారీ కణితి తొలగింపు

డాక్టర్ ఆజాద్ చంద్రశేఖర్ బృందం ఘనత

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ వైద్యులు మరో అరుదైన, అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 36 ఏళ్ల సంసున్ నహర్ బీబీ అనే మహిళ గత కొద్ది రోజులుగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె ‘రైట్ హెమిథోరాక్స్ ఫైబ్రోమా టోసిస్‘ అనే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్, విద్యానగ ర్‌లోని దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్స ర్ సెంటర్‌ను కుటుంబ సభ్యులు సంప్రదించారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడి కల్ డైరెక్టర్ డా. యు. ఆజాద్ చంద్రశేఖర్ ఈ కేసు ను ఒక సవాలుగా స్వీకరించి చికిత్స ప్రా రంభించారు.  సీఈసీటీ, పెట్ - సీటీ స్కా న్, ట్రూ-కట్ బయాప్సీ నివేదికల ఆధారంగా ఖచ్చితమైన ప్రణాళికతో ‘వా ట్స్ గైడెడ్ ఎక్సిషన్’ అనే అత్యాధునిక విధానంతో శస్త్రచికి త్సను చేపట్టామని ఆయన చెప్పారు. సుమా రు 8 నుంచి 10 గంటల పాటు సాగిన ఈ అరుదైన శస్త్రచికిత్స సమయంలో గుండె, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలకు ఎలాం టి హాని కలగకుండా కేవలం కణితినే విజయవంతంగా తొలగించగలిగారు. చికిత్సకు మంచి స్పందన చూపిన ఆమెను పది రోజుల్లోనే డిశ్చార్జ్ చేశారు.