16-12-2025 12:00:00 AM
వేధిరే మేఘారెడ్డి ప్యానెల్‌లో సర్పంచ్ సహా 8 వార్డు మెంబర్ల ఘన విజయం
ప్రజల కష్టాల్లో తోడుంటా
వెదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మేఘారెడ్డి
మునుగోడు, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమీప బంధువు వెదిరే బ్రదర్స్, మేఘారెడ్డి ప్యానెల్ తరఫున కొంపల్లి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో 8 వార్డులతో సహా సర్పంచ్ స్థానాలను గెలిపించుకున్నారు. గ్రామంలో 2000 పైచిలుకు ఓటర్లు, 10 వార్డులు ఉండగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు బరిలో దిగాయి. సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో వెదిరే బ్రదర్స్ ప్యానెల్ తరఫున జీడిమెట్ల నిర్మల దశరథ సర్పంచుగా గెలిచారు.
అలాగే 9, 10 వార్డుల్లో వెదిరె బ్రదర్స్ ప్యానెల్ సహకారంతో సామాన్య అభ్యర్థులు గెలిచి రికార్డు సృష్టించారు. వెదిరె బ్రదర్స్ తమ మాతృమూర్తి పేరిట కొంపెల్లి గ్రామంలో వెదిరే పూలమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత రెండు మూడు సంవత్సరాలుగా అనేకమైన సేవా కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ గ్రామంలో మమేకమై తిరిగారు.
ప్రజల నుండి మంచి ఆదరణ పొంది ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో వన్ సైడ్ గా ఎనిమిది వార్డులతో సహ సర్పం పీఠాన్ని అధిష్టించారు. వెదిరే బ్రదర్స్ అయిన విజయేందర్‌రెడ్డి గ్రామంలో ఏడవ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించి గ్రామపంచాయతీ పాలకవర్గంలో ఉపసర్పంచుగా ఎన్నికయ్యారు.
ఆపదొస్తే అండగా నిలుస్తా: మేఘారెడ్డి
కొంపల్లి గ్రామ ప్రజలు మార్పు కోరి ఆదరించి అభినందించి ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లవేళలా మీ కష్టాల్లో తోడుంటూ ఆపదొస్తే అండగా నిలుస్తా. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి కొంపెల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు కృషి చేస్తా. నిజమైన లబ్ధిదారులకు నిరుపేదలకు ప్రభుత్వం నుండి వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలను అందే విధంగా చూస్తాను. నాపై నమ్మకంతో సర్పంచు పీఠాన్ని కైవసం చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
ప్రజలకు కృతజ్ఞతలు
ఫౌండేషన్ సేవలతో గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యపై నిరంతరం శ్రమిస్తూ ప్రతి ఒక్కరి ఆశయం అభివృద్ధి ముందుకు సాగేలా ప్రయత్నిస్తాను. విద్య ఉపాధి రంగాలను బలోపేతం చేస్తా, ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపడతాము. గ్రామ అధికారులు ప్రజలు గ్రామ అభివృద్ధికి సహకరించాలని, ఆశీర్వదించిన ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు.
వెదిరే విజయేందర్‌రెడ్డి-, ఉపసర్పంచ్
ప్రజలకు అండగా ఉంటాం
గ్రామ అభివృద్ధికి మార్పు కోరి మాకు అండగా నిలిచిన ప్రజలకు నిత్యం సేవలు అందిస్తాం. గ్రామంలో మొదటగా మురికి కాలువలు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యానికి చర్యలు చేపడతాం. గ్రామ అధికారులను పాలకవర్గాన్ని కలుపుకుపోతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ప్రతి ఒక్కరూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి.
జీడిమెట్ల నిర్మలదశరథ, కొంపెల్లి సర్పంచ్