16-12-2025 12:36:22 PM
అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
వనపర్తి, (విజయక్రాంతి): ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు నానా రకాలుగా యత్నిస్తున్నారు. వనపర్తి జిల్లా(Wanaparthy District) పాన్ గల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి ఇంటి వద్ద బిఆర్ఎస్ నేతలు రమేష్ రెడ్డి, నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి లు ఓటర్లకు చీరలు పంపిణి చేస్తుండగా... కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.దీంతో బిఆర్ఎస్ నేత తిరుపతి రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు.బిఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి ఇంటి వద్ద దాదాపు 5వేల చీరలు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టపగలే ఓటర్లకు చీరలు పంచేందుకు బిఆర్ఎస్ నాయకులు బరితెగించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.