16-12-2025 12:00:00 AM
బాన్సువాడ, డిసెంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ నసుల్లాబాద్ మండలంలోని రైస్ మిల్లులపై సంబంధిత అధికారుల నిఘా కరువైంది. ఏకంగా బయట నుంచి ఆటోలో బియ్యం, నూకలు రావడం పట్ల తర్వాత చర్చనీ అంశంగా మారింది. కాగా మధ్యాహ్నం వేళలో ఈ ఆటో రైస్ మిల్ లోకి రాగా అధికారులకు సమాచారం ఇచ్చిన అధికారులు రైస్ మిల్లర్లకు వత్తాసు పలికి కాలయాపన చేసి రాత్రి వరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం రైస్ మిల్ను సీజ్ చేయకపోవడం బట్టి చూస్తే అధికారులు రైస్ మిల్లర్లకు ఏ మేరకు వత్తాసు పలుకుతున్నారు ఇట్టే అర్థమవుతుంది రైస్ మిల్లర్లకు పరోక్షంగా వత్తాసు పలుకుతున్నారని అక్రమ దందా చేయడానికి చర్చించుకుంటున్నారు.
ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందించే అధికారులు అక్కడున్నక్కడున్నాం ఎలక్షన్ డ్యూటీలో ఉన్నామంటూ కాలయాపన చేసి రైస్ మిల్లర్లకు పరోక్షంగా వత్తాసు పలికి ఈ సంఘటన నీరుగారిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏదైనా రైస్ మిల్లులో బయటనుంచి ఒక్క ఎత్తు వచ్చిన దానిని వెంటనే సీజ్ చేయాల్సిన సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో కాలయాపన చేసి రేపు మాకు అంటూ ఏదో వచ్చాం వెళ్ళాం అనే చందంగా మార్చారని సమాచారం.
గతంలో నసురుల్లాబాద్, బీర్కూరు రైస్ మిల్లులపై అనేక కథనాలు వచ్చిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, దీంతో రైస్ మిల్లల్లో అక్రమాలు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. అక్రమ దందా దర్జాగా కొనసాగుతున్న సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికా రులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అసలు మతల అర్థమవుతుందని ఆయా మండలాల వాసులు చర్చించుకుంటున్నారు.
రైస్ మిల్లులో సంచులు తారుమారు...?
బయటనుంచి వచ్చిన ఆటోలో సుమారు పాతికకు పైగా సంచుల్లో బియ్యం నూకలు ఉండగా అధికారులు బయటకు వెళ్లి సాయంత్రం వచ్చేలోపు సంచులు తారుమారు కావడంతో పాటు మొత్తం నూకలు ఉన్నట్లు రైస్ మిల్లులో తారుమారు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముందుగా రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తామని చెప్పి కామారెడ్డి నుంచి ఉన్నతాధికారులు వస్తున్నారని కాలయాపన చేయడం వెనుక అసలు మతల ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దీనిని బట్టి చూస్తే రైస్ మిల్లులో అక్రమాలు ఏ మేరకు జరుగుతున్నాయో అధికారులు ఎలాంటి నిఘా వేశారో ఇట్టే అర్థమవుతుందని తెలుస్తోంది. ఇప్పటికైనా నసురుల్లాబాద్ బీర్కూరు రైస్ మిల్లులపై ప్రత్యేక టీం ద్వారా ఏర్పాటు చేస్తే అసలు వాస్తవాలు బహిర్గతం అవుతాయని అక్రమాలు జరిగిన రైస్ మిల్లులను సీజ్ చేయడం కేసులు నమోదు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని కంచే చేను మేసిన చందంగా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రైస్ మిల్లు పై చర్యలేవి...!
బయటనుంచి ఆటోలో ఒక్క గింజ కూడా వస్తే రైస్ మ్పి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని సంఘటన జరిగి ఒకరోజు గడిచిన కాలయాపన చేశారని తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ సంఘటనపై చర్యలు తీసుకుంటారా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఆయా మండలాల్లో రైస్ మిల్లులలో అక్రమాలు జరిగేలా వత్తాసు పలుకుతారా వేచి చూడాలని ఆయా మండలాల వాసులు అభిప్రాయపడుతున్నారు.