calender_icon.png 16 December, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్, డిప్యూటీ మేయర్ కైనా సమాచారం ఉందా?

16-12-2025 12:46:47 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(GHMC Council Meeting) రసవత్తరంగా జరుగుతోంది. వార్డుల పునర్విభజనపై కార్పొరేటర్లు అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former minister Talasani Srinivas Yadav) అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని వార్డుల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పార్టీల సలహాలు తీసుకోకుండానే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్  చేశారు. గూగుల్ మ్యాప్ ల ఆధారంగా వార్డుల పునర్విభజన చేపట్టారని సూచించారు.

దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని తలసాని పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు ఉన్నాయా? లేదా? పరిగణలోకి తీసుకోవాలని కీలక సూచనలు చేశారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో సరైన మానవ వనరులు లేవని ఆరోపించారు. పన్నులు వెంటనే మారితే అక్కడి ప్రజలు ఇబ్బందులు పడతారని సూచించారు. వార్డుల పునర్విభజనపై మేయర్, డిప్యూటీ మేయర్ కైనా సమాచారం ఉందా? అని తలసాని ప్రశ్నించారు. కనీస సమాచారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేపడతారు? అన్నారు.