calender_icon.png 16 December, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి

16-12-2025 12:00:00 AM

  1. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి
  2. భారతీయ హిందూ పరిషత్ అంతరాష్ట్రీయ సంస్థ డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): - భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని భారతీయ హిందూ పరిషత్ అంతరాష్ట్రీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు కోల శివరామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని భద్రకాళి ఆలయ ప్రాంగణంలో 5 కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ దేశంగా, గోమాతను జాతీయ జంతువుగా, రామచరిత మానస్ గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

పార్టీలకతీతంగా ప్రతి హిందువు ఒక సైనికుడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని 5 కోట్ల సంతకాల సేకరణలో భాగంగా భద్రకాళి ఆలయ ప్రాంగణంలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యకుడు గంప శ్రావణ కుమార్, జిల్లా ఇన్‌చార్జి వరుణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ దిడ్డిరాజు, దేవేందర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.