07-09-2025 08:51:55 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఈసాబిన్ అలీ కుమారుడు సాలంబిన్ ఈసా సౌదీ అరేబియాకు చెందిన ఖతర్ దేశంలో ఉపాధ్యాయ వృత్తి చేపడతారు. ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభను కనబరిచినందుకుగాను అక్కడి ఇండియన్ కల్చర్ సెంటర్ వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సాలంబిన్ ఈసా కు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సాలంబిన్ ఈసా మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన నేను ఇక్కడి వారు నన్ను ఈ అవార్డుతో సన్మానించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మన భారతదేశ ఖ్యాతిని పెంపొందిస్తానని ఆయన అన్నారు. ఈ శుభ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాలేఖ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనారిటీ కార్యదర్శి యండి. దావూద్ సాలం బిన్ ఈసాను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.