07-09-2025 08:54:21 PM
కరీంనగర్, క్రైమ్: 2025-ట్రినిటీ బాయ్స్ క్యాంపస్ ఫ్రెషర్ డే వేడుకలు కరీంనగర్ లో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ ప్రిన్సిపాల్ స్టాఫ్ సభ్యులు, ట్రినిటీ సంస్థ ప్రతినిధులు కలసి ఈ శోభాయమాన కార్యక్రమంలో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి ట్రినిటీ వ్యవస్థాపక ఛైర్మన్, గౌరవ అతిథిగా శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి గ్రూప్ ఛైర్మన్ హాజరై ఉత్సవానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా వచ్చిన విద్యార్థులకు స్వాగతమని తెలుపుతూ, విద్యార్దులను తల్లిదండ్రుల గొప్ప విశ్వాసంతో ఇక్కడ జాయిన్ చేయడం జరిగిందని చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ, ప్రతిరోజు చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ఉన్నత ఉద్యోగాల సాధించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని తన ఆకాంక్షను వ్యక్తీకరించారు.
ఎవరైతే ఐఐటీ, నిట్ లో సీటు సాధించాలి అనే లక్ష్మంతో చేరారో వారు మనం వచ్చిన చేయాల్సిన పని ఏంటి అని, మన బాధ్యత ఏంటి అని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజునుండి ఆ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ కావలసిన అవసరం ఉంది. విద్యార్థులు కాలయాపన చేస్తే నష్టపోయేది వారే కాబట్టి రాబోయే మెయిన్స్ పరీక్షలు లో ఏ విధంగా సీటు సాధించాలి అనే విషయాలపై ద్రృష్టి పెట్టాలి అని పేర్కొన్నారు.ఇంజనీరింగ్ ఫీజులు డొనేషన్ లక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఎంసెట్ మంచి మార్కులు, 10000 లోపు ర్యాంక్ సాధించితే ఇంజనీరింగ్ కోర్స్ లో 15 లక్షల రూపాయలు వరకు ఆదా అవుతుంది .మిగిలిన సమయం వృధా చేయకుండా పట్టుదలతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆని, తద్వార అమ్మ నాన్న కు, గ్రామం కు మంచి పేరు తేవాలని కోరారు.ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సీబీఎస్ఈ పరీక్షల మాదిరిగా కొంత సమయం ముందుగానే నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచార ఉన్నది కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆ దిశగా వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలియజేశారు.