calender_icon.png 8 September, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ కళాక్షేత్రంలో కళాకారులకు పురస్కారాలు

07-09-2025 08:48:36 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): కాకతీయ కళా వైభవం పేరిట శాంతి కృష్ణ ఆధ్వర్యంలో వరంగల్లో ఉన్నటువంటి 108 మంది కళాకారులకు పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు, గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత డాక్టర్ శాంతి కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 1112 మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రోగ్రాంలు  చేసినటువంటి సంస్థగా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా, ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించిందన్నారు. అటు తెలంగాణ రాష్ట్రానికి, ఇటు మన ఓరుగల్లు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఈరోజు ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. కాళోజి  కళాక్షేత్రంలో కళాకారులకు కార్యక్రమ నిర్వహణలో ఫీజులో మినహాయింపు కలిగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కళాకారులు కలలను బ్రతికించడం కోసమే బ్రతుకుతున్నారు,కావున  అలాంటి కళాకారులను గుర్తించి ప్రభుత్వం తరఫునుంచి ప్రోత్సహించి ఆదుకోవాలన్నారు.

ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు ప్రోత్సాహాన్ని గనక అందిస్తే తనలాంటి  వేలాదిమంది ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ రికార్డులు సాధిస్తారు అని అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి మన సనాతన ధర్మం అని ఈ సనాతన ధర్మంతోటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలు గాని, అనేక జాతులుగాని, అనేక దేశాల సాంప్రదాయాలు గాని, మన సనాతన ధర్మంతో ప్రారంభం అయ్యాయన్నారు. కాబట్టి సనాతన ధర్మం చాలా గొప్పది. ధర్మాన్ని ప్రపంచవ్యాప్తీకరణం చేయాలంటే కేవలం కళాకారులతోటి మాత్రమే సాధ్యమైతుందని తాను నమ్ముతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్, రామకోటయ్య , శ్రీ గాయత్రీ పీఠం పీఠాధిపతులు జగద్గురు డాక్టర్ శ్రీకాంతేంద్ర స్వామి,ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేష్ బాబు, వెయ్యి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, సినీ కళాకారుడు రఘు, రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుపతయ్య, పొడిశెట్టి విష్ణువర్ధన్, పద్మజా రాణి, వెంపటి శ్రావణి, సన్మాన గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.