calender_icon.png 20 November, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన మండల వాసి

20-11-2025 09:00:56 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల పరిధిలోని కొమ్మాల గ్రామానికి చెందిన పాలబిందెల చంద్రయ్య-పద్మ దంపతుల కుమారుడు పాలబిందెల ప్రవీణ్ భౌతిక శాస్త్రంలో డాక్టరేట్(పీహెచ్డీ) డిగ్రీని విజయవంతంగా సాధించాడు. గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి అధునాతనమైన స్పిన్ ట్రానిక్స్ రంగంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. ప్రవీణ్ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (భౌతికశాస్త్రం)పూర్తి చేసిన అనంతరం తమిళనాడులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ లో అనేక రచనలు రచించి వివరించాడు. డాక్టరేట్ పొందిన ప్రవీణ్ ను తల్లిదండ్రులు, అధ్యాపకులు, గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.