20-11-2025 08:58:53 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సూర్యాపేట ఆర్టీసీ డిపో నుండి మండల కేంద్రం అర్వపల్లి మీదుగా హైదరాబాద్ కు టీఎస్ ఆర్టీసీ అధికారులు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసును గురువారం ప్రారంభించారు.ఈ బస్సు ప్రతిరోజు సాయంత్రం 5గంటలకు డిపో నుండి బయలుదేరి 5:20గంటలకి అర్వపల్లికి చేరుతుంది.ఇక్కడి నుండి జాజిరెడ్డిగూడెం మూసీ నది బ్రిడ్జి మీదుగా నకిరేకల్ చేరుకొని అక్కడి నుండి రాత్రి 8:30గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ కు చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం5 గంటలకు హైదరాబాదు నుండి బయలుదేరి ఇదే రూట్లో ఉదయం 9గంటలకు అర్వపల్లికి చేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఈప్రాంత ప్రజలు గతంలో హైదరాబాద్ కు వెళ్లాలంటే సూర్యాపేట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది.బస్సు సర్వీసును ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.