calender_icon.png 20 November, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ బంగారంతో అమాయకులకు గాలం

20-11-2025 09:36:16 PM

గాలానికి చిక్కిన ఆశావాహుకుడు

నకిలీ బంగారం అని తేలడంతో లబోదిబో.... పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు చెక్కిన అంతర రాష్ట్ర ప్రధాననిందితుడు, అనుచరులు ముగ్గురు పరార్.

5,00,000  నగదు, 200 గ్రాముల అచ్చుపోసిన నకిలీ బంగారపు బిల్లలు,7 లక్షల కార్,స్మార్ట్ ఫోన్, ఒక కుండ స్వాదీనం

వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి రాజశేఖర్ రాజు.

మిర్యాలగూడ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖరరాజు పర్యవేక్షణలో  సీసీఎస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ బంగారం తో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడి అరెస్టు చేసిన మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ లు.ప్రధాన నిందితుడు అరెస్టు,ముగ్గురు నిందితులు పరారీ.మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్న ప్రధాన నిందితుడు గోవిందప్ప తండ్రి నాగప్ప, వయస్సు 40, కోరచరహళ్లి, హురులికలు, కుడ్లిగి, బళ్ళారి జిల్లా, కర్ణాటక స్టేట్ గా పేర్కొన్నారు.

పరారీలో ఉన్న నిందితులు మహేష్,లోహిత్,నాగప్ప, ప్రసన్నగంగప్ప సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అమాయక ప్రజలను గుర్తించి వారికి పరిచయస్తుడుగా మాట్లాడేవారు.ప్రస్తుతం బంగారం ధర ఎక్కువ ఉండటంతో తక్కువ ధరకే  ఇస్తానని నమ్మించి మోసం చేసి సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. మే నెల మొదటి వారంలో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల టౌన్ కు చెందిన కారపు శ్యామ్ సుందర్, అతని స్నేహితుడు పిడుగురాళ్ల కు పోయి తిరిగి వారు సొంత వూరు కోరుట్లకు వెళ్ళే క్రమంలో మిర్యాలగూడ లోని ఉషా రాణి హోటల్ వద్ద అమాయకుడైన ఫిర్యాదుదారుడితో మాట మాట కలిపి అతని ఫోన్ నెంబర్ తీసుకొని, మాయా మాటలు చెప్పి, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తాను అని కర్నాటక రాష్ట్రంలోని హోస్ పేట్ దగ్గరలోని బనికల్ కు పిలిపించి నమూనా గా నకిలీ బంగారు కుండలో నుండి రెండు నిజమైన బంగారు బిల్లలను ఇచ్చి, తర్వాత మే నెల మూడవ వారంలో తిరిగి మిర్యాలగూడ లోని ఉషారాణి హోటల్ దగ్గరకు వచ్చి, బాధితుడిని  మోసం చేసి నకిలీ బంగారాన్ని ఇచ్చి, తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి శ్యామ్ సుందర్ దగ్గర నుండి 12 లక్షల రూపాయల గుంజుకొని టాటా టీఆగో కార్ నెంబర్ కె ఏ 35-P-0914 లో వెళ్ళిపోయినారు.

ఇట్టి విషయం పై ఫిర్యాదుదారుడు కంప్లయింట్ చేయగా మిర్యాలగూడ టూ టౌన్ పియస్ లో కేసు నమోదు అయినది. మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి-నార్కెట్పల్లి బైపాస్ లోగల శ్రీ కృష్ణపట్నం హోటల్ అవతల రోడ్ వద్ద వాహనా తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన కర్నాటక రిజిస్ట్రేషన్ కలిగిన గ్రే కలర్ గల టాటా టీఆగో కారును ఆపి విచారించగా,నకిలీ బంగారంతో అమాయక ప్రజలను  మోసాగిస్తున్న  గోవిందప్ప తండ్రి నాగప్ప,బళ్లారి జిల్లా,కర్ణాటక స్టేట్ గా గుర్తించి. పట్టుబడి చేసి,రిమాండ్ చేయడం జరిగిందన్నారు.

ఈ కేసును చేదించిన మిర్యాలగూడ డి.ఎస్.పి.కే. రాజ శేఖర్ రాజు ఆధ్వర్యంలో సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేందర్ రెడ్డి, చంద్రశేకర్ రెడ్డి,మిర్యాలగూడ టూ టౌన్ సీఐ సోమనర్సయ్య,ఎస్సైలు బి. రాంబాబు,సి‌సి‌ఎస్ ఎస్‌ఐ విజయ్ కుమార్, సి‌సి‌ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు వర్ధన గిరి, పుష్పగిరి,కానిస్టేబుల్ వెంకట్, మహేష్ సాయి, ఎం‌డి.రామకృష్ణ, జి. లక్ష్మయ్య,ఎన్. రాజశేఖర్ గార్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పవర్, అభినందించారని పేర్కొన్నారు. ఈ విధంగా ఎవరైనా మోస పోయినట్లు అయితే దైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని జిల్లా ఎస్పి ప్రజలకు తెలియపరిచారు. నల్గొండ జిల్లా క్రైమ్ పోలీసుస్టేషన్ 8712670162, 8712670163 నెంబర్లకు సంప్రదించవలసిందిగా తెలిపారు.