calender_icon.png 20 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలికను గర్భవతిని చేసిన మైనర్ బాలుడు

20-11-2025 08:51:43 PM

చిట్యాల (విజయక్రాంతి): మైనర్ బాలికను గర్భవతిని చేసిన మైనర్ బాలుడిపై, గర్భవిచ్చిత్తికి పాల్పడిన రిటైర్డ్ ఏఎన్ఎంపై కేసు నమోదు చేశామని సీఐ కే.నాగరాజు గురువారం తెలిపారు. నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు చిట్యాల మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇంస్టాగ్రామ్ లో పరిచయం చేసుకొని తరువాత తనను ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని మైనర్ బాలికను ప్రేమ పేరుతో వశపరచుకొని ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి నేరస్తుడు బలవంతంగా ఆమెను శారీరకంగా పలుమార్లు కలిశాడు.

కొన్ని రోజుల తర్వాత మైనర్ బాలిక తన ఆరోగ్యం బాగాలేదు అని ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి రాగా తల్లి తనని చిట్యాలలోని భువనగిరి రోడ్డులో గల సాయి తేజ అనే హాస్పిటల్ నడుపుతున్న రిటైర్డ్ మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్, రిటైర్డ్ ఏఎన్ఎం అయిన సాంబరాజు అండాలు(62) వద్దకు తీసుకొని వెళ్లగా బాలికను స్కానింగ్ చేయించి రిపోర్ట్ చూసి బాలిక మూడు నాలుగు నెలల గర్భవతి అని చెప్పి 25 వేల రూపాయలు ఇస్తే గర్భం తొలగిస్తానని మైనర్ బాలికకు ఒక టాబ్లెట్ ఇచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ స్టాఫ్, పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను సఖి సెంటర్ కు పంపించి విచారణ జరిపించి వివరాలు సేకరించి మైనర్ బాలుడిపై, గర్భ విచిత్తులకు పాల్పడుతున్న అండాలుపై కేసు నమోదు చేశామని సీఐ నాగరాజు తెలిపారు. ఈ కేసును చేదించిన డీఎస్పీకే శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కట్ పల్లి సీఐ కే. నాగరాజు ఆధ్వర్యంలో చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్, వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మధు కానిస్టేబుల్ వెంకన్న, వినయ్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.