calender_icon.png 20 November, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేళ్లు పేద ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించిన పార్టీ సిపిఐ

20-11-2025 08:47:51 PM

* దోపిడి పీడనలు లేని సమ సమాజ స్థాపనే సిపిఐ లక్ష్యం

* సి.పి.ఐ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి

గరిడేపల్లి (విజయక్రాంతి): భారతదేశంలో నూరు సంవత్సరాలుగా పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించిందని,ఏనాటికైనా ఎర్రజెండా నాయకత్వంలోనే దోపిడి పీడనలేని సమ సమాజ స్థాపనే సి.పి.ఐ లక్ష్యమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ,సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,బొమ్మగాని ప్రభాకర్ లు అన్నారు.సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ నాయకత్వంలో జరుగుతున్న బస్సు ప్రచార జాత గురువారం గరిడేపల్లి మండలానికి చేరుకుంది.ఈ జాతకు సిపిఐ మండల నాయకత్వం భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో స్వాగతం పలికారు.మండల కేంద్రంలో నిర్వహించిన సభకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభలో వారు పాల్గొని మాట్లాడారు.

సిపిఐ పార్టీ నూరు సంవత్సరాలుగా పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించి త్యాగాలను చేసిందని ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత సిపిఐ పార్టీకి దక్కిందని వారన్నారు.డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మంలో జరిగే ముగింపు ఉత్సవాలకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు ప్రజలు ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు.కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమూర్తి శ్రీనివాస్,సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉస్తేల, నారాయణరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య,పున్నయ్య, ముళ్ళ జానయ్య, పోటు బుజ్జిబాబు, చవ్వా వెంకన్న,త్రిపురం సుధాకర్ రెడ్డి,ఈశ్వర చారి,గోవిందు, కిరణ్, ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు