calender_icon.png 20 November, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత చేప పిల్లలతో మత్స్యకారులకు ఉపాధి

20-11-2025 08:54:44 PM

జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులు..

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడానికే ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులు అన్నారు. గురువారం మండల పరిధిలోని అడివెంల గ్రామ చౌటచెరువు,రంగారెడ్డి చెరువుల్లో ఎంపీడీఓ పి ఝాన్సీతో కలిసి ప్రభుత్వం అందించిన లక్షా75వేల ఉచిత చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. అనంతరం మాట్లాడుతూ మత్స్యకారులు చేప పిల్లలను పెంచి వాటి ద్వారా ఉపాధి పొందాలని కోరారు.

కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పెందోట గణేష్, పంచాయతీ కార్యదర్శి మహాలక్ష్మి,ఎఫ్ఏ గంగ,మత్స్యశాఖ అధ్యక్ష,కార్యదర్శులు పిట్టల జాని,బంటు యాదగిరి,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల సైదులు,మత్స్య సహకార సంఘం సభ్యులు టి సైదులు,మంగ లక్ష్మయ్య,బొడ్డు వెంకన్న,ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.