20-11-2025 08:46:01 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కేనగర్ కాలనీకి రోడ్డు వెయ్యాలని కాలనివాసులు గురువారం మంత్రి సీతక్కకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తాము కాలనీలో నివాసం ఉంటున్నామని వర్షాకాలం వస్తే ఆర్కేనగర్ రోడ్డు గుండా వెళ్లాలంటే బురదతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తక్షణమే ఈ రోడ్డును బాగు చేయించాలని ఆమె తెలిపారు. కాలనీ లో పార్క్ ఏర్పాటు చేయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 15 వార్డులోని ఆర్ కె నగర్ కాలనీలో మంత్రి సీతక్క పర్యటించడంతో తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేసి రాధాకృష్ణ నగర్ కాలనీ వాసులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రమేష్, వెంకటి రెడ్డి,సిద్ది రాంరెడ్డి, మోసర్ల యాదగిరి, రాజా గౌడ్, ఎలక్ట్రీషియన్ రాములు, మేర రాములు తదితరులు పాల్గొన్నారు.