calender_icon.png 20 November, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ హెచ్ ఎం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించాలి

20-11-2025 08:44:07 PM

ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ..

జనగామ (విజయక్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్ లో గత అనేక సంవత్సరాలుగా దాదాపు 17,541 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్నారని, ఈ ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ డిమాండ్ చేశారు. నేడు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటీలోని డి.హెచ్. క్యాంపస్ లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్ హెచ్ ఎం స్కీములో పనిచేయుచున్న ఉద్యోగులందరూ పేద మధ్యతరగతికి చెందిన వారైనందువలన ప్రతిరోజు నిత్యం క్రింది స్థాయిలో తిరిగి పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయుచున్న వీరి పట్ల జీతాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శించారు. ఎన్ హెచ్ ఎం లో దాదాపు 78 రకాల క్యాడర్ల ఉద్యోగులు పనిచేయుచుండగా వీరందరికీ కేడర్ ఫిక్సేషన్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనం ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న అధికారుల నిర్లక్ష్యం వలన కనీస వేతనాలకు కూడా నోచుకోకుండా ఉద్యోగులు నిత్యం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు దుయ్యబట్టారు.

గత పి.ఆర్.సీ సందర్భంగా ఇవ్వవలసిన ఏడు నెలల పిఆర్సి బకాయిల కై అనేక విజ్ఞప్తులు చేసిన అధికారులు చలనం లేకుండా ఉన్నదని ఉద్యోగులకు రావలసిన ఇతర సౌకర్యాలను సైతం అధికారులు సమకూర్చటం లేదని వారు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఈ స్కీములో ఉద్యోగులకు అటు కేంద్ర ప్రభుత్వ బేసిక్ గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వ బేసిక్ గాని ఇవ్వకుండా శ్రమదోపిడికి గురిచేయుచున్నారని తెలియజేశారు. ఉద్యోగులకు రావలసిన రెండు నెలల జీతాలకై పి.ఆర్.సీ బకాయిల కై బేసిక్ శాలరీ కై రాబోవు రోజుల్లో నిరవధిక సమ్మె సైతం నిర్వహించనున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం చీప్ ప్రోగ్రాం ఆఫీసర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయగా వారు స్పందించి ఈ నెల చివరి లోపు జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం 15600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టెడ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల అంజయ్య , సిద్దిపేట రాజేశ్వరి రెడ్డి,  ఆచంట అభిషేక్ ,ఎల్. సురేష్ నాయక్ ,జాయింట్ సెక్రెటరీ జి.జ్యోతి, డిపిఓల యూనియన్ అధ్యక్షులు సిద్ధార్థ , రమేష్ యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.