calender_icon.png 20 November, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం టీపీటీఎఫ్ తోనే సాధ్యం

20-11-2025 09:34:05 PM

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రామనర్సయ్య

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం టీపీటీఎఫ్ తోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి రామనర్సయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, పీఆర్సీ అమలు చేయాలని,పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న,నాయకులు పి నర్సయ్య,మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పూసపల్లి మల్లయ్య,దారం నాగరాజు,దబ్బేటి యాదగిరి, వడ్లకొండ యాదగిరి, భిక్షం, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.