03-01-2026 06:28:48 PM
మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): బాగా చదివి ప్రయోజకులుగా మారి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ అందిద్దామని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను మదీన మజీద్, రాంనగర్, షాబజార్, మోతినగర్, ప్రభుత్వ బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వ షాబజార్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ... తమకు నాణ్యమైన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు తమ పాఠశాలలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ఎమ్మెల్యే తమ స్వంత నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ అందించడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏ విషయంలోనూ తక్కువ కాదని, సరైన అవకాశాలు కల్పిస్తే వారు కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ఎమ్మెల్యే గ బలంగా విశ్వసిస్తారని తెలిపారు. విద్యార్థులు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని, మహబూబ్‌నగర్ నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐఐఐటి కళాశాలలో సీట్లు సాధించలన్నారు.