04-01-2026 02:16:19 PM
ఈ నెల 21వ తేదీ వరకు గడువు
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పరిక్ష కోసం అర్హులైన విద్యార్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్(Garima Agrawal) ప్రకటనలో తెలిపారు. టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఆర్ఈఐఎస్ గురుకులాల్లో 2026- 2027 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో నూతన ప్రవేశానికి అలాగే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీకి వచ్చే నెల ఫిబ్రవరి 22వ తేదీన ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికెట్లు
కుల, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ సర్టిఫికేట్, ఫోటోలు కావాలి.
ఈ కింది వెబ్ సైట్ లలో దరఖాస్తు చేసుకోవాలి