calender_icon.png 5 January, 2026 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజపేట తండాలో ఉచిత దంత వైద్య శిబిరం

04-01-2026 02:12:43 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రాజపేట తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉచిత దంత వైద్య శిబిరం మాజీ సర్పంచ్ మారగోని వెంకటయ్య యాదవ్ సమక్షంలో ఆదివారం నిర్వహించారు. నల్లగొండ అద్విక్ దంత వైద్యశాల సౌజన్యంతో డాక్టర్ యామా అజయ్ కుమార్, వైష్ణవి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరమును నిర్వహించారు. గ్రామంలోని రోగులను పిప్పి, గార, పాచి, ఎత్తు, వంకర పళ్ళు వ్యాధులను పరిశీలించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ కూడా చేశారు. అత్యవసర శస్త్ర చికిత్సల కోసం నల్లగొండ కి రోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని వైద్య నిపుణులు, నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో సహా, చేరుపల్లి ఈశ్వర్, మల్లేష్, నరేష్, రాజు, జయప్రకాష్, భాస్కర్, బుచ్చప్ప, బాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.