04-01-2026 02:11:21 PM
అధికార పార్టీ వైఫల్యాల బాకీ కార్డుల పంపిణీ.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు చంద్రపురి కాలనీలో అధికార కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో గద్దెనెక్కిందని, వైఫల్యాల బాకీ కార్డులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాకీ ఉన్న మొత్తాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఆయన వార్డులలో తిరిగారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తూ, బిఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో అమలుకాని హామీలతో గద్దేనెక్కిందని, గద్దేనెక్కిన నాటినుండి అదే పంథా కొనసాగిస్తుంది తప్పా అభివృద్ధి మాత్రం శూన్యం అని కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడానికే చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించాం అని తెలిపారు. చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 30 కోట్లతో పట్టణంలో అనేక సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠదామాలు, కుల సంఘ భవనాలు వంటి అనేక పనులను పూర్తి చేశామని,
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండేళ్లలో ఒక్కనాడు కూడా పట్టణంలో తిరిగిన దాఖలాలు లేవుఅని, పట్టణ సమస్యలపై ఒక్కరోజు కూడా స్పందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వస్తేనే హడావుడి చేస్తుంది ఎన్నికల లేకపోతే అసలు పట్టించుకొనే దిక్కే లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు మూటలు మోయడం సంచులు ఇవ్వడం బాగా అలవాటు అని, అదే మాదిరిగా ఎన్నికల సమయంలో మీ వద్ద వస్తారని అన్నారు. కేసిఆర్ హయంలో జరిగిన అభివృద్ధినీ, రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని బేరీజు చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని పట్టణ ప్రజలను కోరుతున్నాను అని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే చిట్యాల మున్సిపాలిటీ ప్రజలకు లాభం జరుగుతుందని, ప్రజలు ఆలోచించి ఓటేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్, ఆది మల్లయ్య, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.