calender_icon.png 5 January, 2026 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఐటియు సమన్వయ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

04-01-2026 02:07:00 PM

మర్రిగూడ:(విజయక్రాంతి): మర్రిగూడ మండలం ఇందుర్తి, మేటిచందాపురం గ్రామపంచాయతీలో సిఐటియు(CITU) గ్రామ సమన్వయ కమిటీనీ ఆదివారం ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, నరేంద్రమోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలకు సిఐటియు గ్రామ కమిటీలు ఉద్యమానికి సిద్ధమైనాయి.

కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉన్నటువంటి పేరును మార్చి వికసి భారత్ రాంజీ అని కొత్త చట్టం అమలు చేయడం అట్లాగే రైతులకు విద్యుత్ సవరణ చట్టాలు రద్దయ్యే వరకు గ్రామాల నుండి కార్మికులు ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నారు గ్రామాలలో కార్మికుల నూతన కమిటీ ఎన్నుకొన్నారు. కన్వీనర్ గా  అనంతలక్ష్మి ,కోకన్వీనర్ గా వారాల శోభను కమిటీ సభ్యులుగా అయితగోని సరిత లపైంగి దుర్గమ్మ ఏర్పుల దుర్గమ్మ, గిరి యాదమ్మ ,ఎండి షబానా, ఊరు పక్క నరసింహ ,ఊరు పక్క బిక్షమయ్య ,ఏరుకొండ రాఘవేంద్ర లతో కమిటీనీ ఎన్నుకొన్నారు.