04-01-2026 02:04:55 PM
గులాబీ గూటికి ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. తాజాగా నిజామాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్కపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తలే బలమని, సింగం ప్రసాద్ వంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు పార్టీలోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.తనతో పాటు వంద మంది అనుచరులు పార్టీ సైనికులుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..