14-07-2025 12:26:19 AM
ఎల్బీనగర్, జులై 13 : ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు.. పాలకులు శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, శివారు కాలనీల్లో ప్రజల కు కనీస, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలన్నారు. శనివారం ఎల్బీనగర్ ని యోజకవర్గంలోని నాగోల్, హయత్ నగర్ డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లు చింతల సు రేందర్‌యాదవ్, నవజీవన్‌రెడ్డి, కొప్పుల న ర్సింహరెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు.
హయత్ నగర్, మన్సూరాబాద్, నాగోల్ డివిజన్లల్లో సరైన డ్రైనేజీ, రోడ్లు, స్ట్రా మ్ వాటర్ డ్రైన్ లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హయత్‌నగర్‌లోని కుమ్మరి కుంటను ఆయన పరశీలించారు. ఆయా డివిజన్లలో దాదాపు 30 కాలనీల ప్రజలు రాకపోకలు సాగిస్తున్న ప్రధాన మార్గంలో సరైన రోడ్డు మార్గం లేకపోవడం బాధాకరమన్నారు.
సాగర్‌రింగ్ రోడ్డు నుంచి కుమ్మరి కుంట మీదుగా హయత్నగర్కు ఈ రోడ్డు ప్ర ధానం అన్నారు. కుమ్మరికుంట, హయత్ నగర్ చెరువు మధ్య ఉన్న 80 నుంచి 100 ఫీట్ల రోడ్డును పునరుద్ధరించేందుకు రూ.6 కోట్లతో త్వరలోనే నిర్మాణ పనులు చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
118 జీవో పేదలకు దక్కని ఇంటి స్థలాలు
నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీ పార్క్ లోని వాకర్స్ తో ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఈట ల రాజేందర్ మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన విధానమన్నారు. రానున్న రోజుల్లో మల్కాజిగిరి పార్లమెంట్ లోని అన్ని డివిజన్లలో అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
పాలకులు కొన్ని సమయా ల్లో ప్రజల మీద ప్రేమ కంటే వారి ఓటు మీ ద ప్రేమతో పనులు చేస్తుంటారని, దానికి ఉదాహరణే.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో తీసుకువచ్చిన 118 జీవో అన్నారు. మునుగోడు ఎన్నికల కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్ పాలకులు 118 జీవో తీసుకువచ్చారని విమర్శించారు. 118 జీవోతో బీఎన్ రెడ్డి నగర్, నాగోల్ డివిజన్లలోని అనేక కాలనీల ప్రజలు ఇంటి స్థలాలకు పట్టా లభించక ఇ బ్బంది పడుతున్నారని తెలిపారు.
హెచ్‌ఎండీఏ పర్మిషన్ ఉన్న కాలనీలను కూడా 118 జీవో పరిధిలోకి తీసుకురావడం కేసీఆర్ ప్ర భుత్వం చేసిన దుర్మార్గమన్నారు. 118 జీవో ను ప్రస్తుత పాలకులు వెంటనే సరిచేయాలని కోరారు. ‘హైడ్రాకు నేను వ్యతిరేకం కా దు.. సమాజం పురోగమనంలో ఉండాలని కోరుకునేవాడిని. కానీ పేదల ఇల్లు కూల్చడానికి వ్యతిరేకం. అనుమతి ఇచ్చిన మీరే ఇ ల్లీగల్ అంటే ఎలా ? ’ అని ఈటల ప్రశ్నించారు. ఎల్బీనగర్‌లో పోలైన ఓట్లలో 60 శా తం ఓట్లు నాకు వేశారు.
అందుకే నేను కాదు నా పని మాట్లాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగోల్, మన్సూరాబాద్, కొత్తపేట, గడ్డిఅన్నారం డివిజన్ల కార్పొరేటర్లు చింతల అరుణా సురేందర్ యాదవ్, కొ ప్పుల నర్సింహ రెడ్డి, పవన్ కుమార్, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామల రంగారెడ్డి, గాయకుడు నల్లగొండ గద్దర్, బీజేపీ నాయకులు సిద్దాల ఐలయ్య, శ్యామ్ కుమార్, సంజీవ రెడ్డిపాల్గొన్నారు.