calender_icon.png 14 July, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత సామాజిక బాధ్యతలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

14-07-2025 12:28:21 AM

జిల్లా యువత సమన్వయకర్త టీ. ఐశయ్య

ఘట్ కేసర్, జూలై 13 : యువత సామాజిక బాధ్యతలను తెలుసుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉన్నదని జిల్లా యువత సమన్వయకర్త టి. ఐశయ్య అన్నారు. అనురాగ్ యూనివర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ యూ నిట్2, మేరా యువ భారత్ రంగారెడ్డి జిల్లా సహకారంతో ప్రపంచ జనాభా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమం ప్రధానంగా జనాభా సంబంధిత సమస్యల పై అవగాహన పెంచడమే కాక, సుస్థిరమైన మరియు సమానత్వపూరిత సమాజ నిర్మాణంలో యువత పాత్రను ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టి. ఐశ య్య ఈ సందర్భంగా మాట్లాడుతూ యు వత సామాజిక బాధ్యతను తెలుసుకోవాల్సిన అవసరం, అలాగే జనాభా నియంత్ర ణలో వారు పోషించగల కీలక పాత్రను ప్రేరణాత్మకంగా వివరించారు. ఈసందర్భంగా ముఖ్య ఆకర్షణగా ‘జనాభా స్థిరీకరణసుస్థిర అభివృద్ధికి మార్గం‘ అనే అంశంపై ఎలొక్యూషన్ పోటీ నిర్వహించబడింది.

అనురాగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు మరి యు ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛందులు ఈపోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు జనాభా నియంత్రణకు సంబంధించి తమ అభిప్రాయాలను స్పష్టంగా, బలంగా వ్యక్తపరిచా రు.విజేతల ప్రతిభను గుర్తించడానికి మరి యు ప్రోత్సహించేందుకు మొదటి, రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు స్మృతిచిహ్నాలు మరియు ప్రశంసాప త్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు, యూనిట్-2 ప్రో గ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.