calender_icon.png 13 October, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్నే.. ఇక భీమన్నా..!

13-10-2025 12:00:00 AM

  1. భక్తులకు తాత్కాలిక మార్పు 

రాజన్న ఆలయ ఉత్సవ మూర్తులను 

భీమేశ్వరాలయంలో ప్రతిష్టాపన 

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాజన్నే ఇక భీమన్నా..వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన  వేములవాడ  రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలన్నింటికి తాత్కాలిక విరామం ఏర్పడింది. రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ఇక నుండి రాజన్న మొక్కులు కొనసాగనున్నాయి.

ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమైన నేపథ్యంలో రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలు, కోడె మొక్కులు, అభిషేకములు, అన్నపూజ, నిత్య కల్యాణం ఇతర పూజలు అన్నిటిని రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేస్తూ ఉత్సవమూర్తులను రాజన్నే ఇక భీమన్నకు తరలింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాజన్న ప్రీతిపాత్రమైన కోడెమొక్కను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ చేతుల మీదుగా కొనసాగింది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. రాజన్న ఆలయంలో భక్తుల ప్రవేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. స్థానికుల్లో. భక్తుల్లో ఇంకా సమయం ఉంది అని భావించే క్రమంలో రాజన్న ఆలయ ఈవో రమాదేవి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

నేటి నుండి రాజన్న భక్తులు భీమన్న వద్ద మొక్కలు, దర్శనాలు చేసుకోవాలని ప్రకటన చేయడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక నుండి రాజన్నకు ఏకాంత పూజలు కొనసాగుతాయని ప్రకటన విడుదల చేయడంతో భిన్నవాదనలు వ్యక్తం అవుతున్నాయి. 

తొలి విడతగా రూ. 76 కోట్లు.. ప్రారంభమైన పనులు..  

రాజన్న ప్రధాన ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం రూ. 76 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాన ఆలయ విస్తరణ లో భక్తులకు రాజన్న దర్శనాలు, పూజ మొక్కులను భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి.. వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరిగేలా పనులు చేపడుతున్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ. 47 కోట్లతో వేములవాడ మూలవాగు నుండి రాజన్న ఆలయం వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు.. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

రూ. 35 కోట్లతో నిత్యాన్నదాన పనులు సైతం త్వరలో ప్రారంభంకానున్నాయి. తిరుపతి, యాదాద్రి తరహాలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.- అర్థం చేసుకున్నారు. రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాల నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రతిపక్ష అసమ్మతి వాదులంతా ఈరోజు వచ్చిన ప్రకటనతో సందిగ్ధంలో పడిపోయారు. శనివారం జరిగిన ఉత్సవమూర్తులను భీమేశ్వరాలయంలో ప్రతిష్టించే కార్యక్రమానికి హాజరుకావడంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై అసమ్మతి తొలిగిపోయిందన్న అభిప్రాయాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.