19 March, 2026 | 5:50 AM

చినుకు పడితే చిత్తడే

19-03-2026 12:00 AM

పెంచికలపేట్, మార్చి 18(విజయ క్రాంతి): బుధవారం తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వర్షానికి మండలంలోని బొంబాయి కూడా గ్రామపం చాయతీ కార్యాలయం ఆవరణలో గల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రం చిత్తడిగా మారింది. పెద్ద ఎత్తున నీరు చేయడంతో చెరువును తలపించేలా దర్శనమిచ్చింది.

పాఠశాల ,అంగన్వాడి కేంద్రం, పంచాయతీ కార్యాలయం ఎదుట నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు, పిల్లలు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.