19 March, 2026 | 8:52 AM

పాడిపంటలతో ప్రజలు సుఖంగా ఉండాలి

19-03-2026 12:00 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు 

నిర్మల్, మార్చి 18 (విజయక్రాంతి) : పరాభవ’ నామ సంవత్సరం ఉగాది ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపి పాడిపంటలు పండి ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను రాష్ట్ర పర్యాటక టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా ప్రజలకు రైతులకు ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన వారసత్వపు పండుగ అని అభివర్ణించారు.

పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు... జాతిని సజీవంగా నిలుపుతాయని తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలి అని  మంత్రి ఆకాంక్షించారు.  సమృద్ధిగా పంట లు పండి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అభిలా షించారు.

ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానా లతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పండగ అన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో.. ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రైతన్నల సంక్షేమానికి  రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తోందని పేర్కొన్నారు.