calender_icon.png 4 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాములకు అన్నదానం

03-11-2025 12:57:34 AM

మిర్యాలగూడ. నవంబర్ 2 (విజయ క్రాంతి): మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో 12వ  రోజు అన్నప్రసాద వితరణ కొనసాగింది. ఆదివారం జరిగిన పూజల్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాలధారణ చేసిన స్వాములకు అన్నదానం ప్రారంభం చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , మాధవి దంపతుల 30వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది అయ్యప్ప స్వాములకు మండల కాలం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.

భక్తులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, వ్యాపారవేత్త గుడిపాటి నవీన్,  25 వ వార్డు ఇన్చార్జి గోదాల జానకి రామ్ రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ పాతూరి శరత్, నాయకులు గొట్టుముక్కల లక్ష్మణ్, శ్రీనివాస్ రాథోడ్ , నాయుడు గురు స్వామి, నాగరాజు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.