calender_icon.png 4 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సంపత్

03-11-2025 06:38:22 PM

అలంపూర్: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న సన్న బియ్యం అందిస్తుందన్నారు. కృష్ణానగర్ డివిజన్ పరిధిలో నిరుపేద కుటుంబంలో భోజన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు.

నిరుపేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు వంటి మహత్తర పథకాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరినట్లు ఆయన తెలిపారు.